మామిడి

మన రాష్టంలో మామిడి పంటను దాదాపు 7,64,495 ఎకరాల  విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. మొత్తంగా 24,45,824 టన్నుల మామిడి పండ్ల ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగరం, విశాకపట్నం, చిత్తూరు, కడప, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలలో విస్తారంగా సాగుచేస్తారు. దేశంలో మొత్తం మామిడి ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా సుమారు 24 శాతం వరకు ఉంది.

 

రకాలు

    రకం -  లక్షణాలు

         చీడపీడలు

       అనుకూలత

     ప్రత్యేక లక్షణాలు

 

ఎ. కోత రకాలు :

 

 

బంగినపల్లి (బనేశాన్):
చెట్టు మద్యస్థం, పండు పెద్దది. తోలు పలుచగా ఉంటుంది.  పసుపురంగు కండ గట్టిగా ఉండి నార తక్కువగా ఉంటుంది. నాణ్యమైన రకం. నిలకడగా ప్రతి ఏటా కొద్దిగా ఆలస్యంగా కాపు కాచే రకం.

 

బూడిదతెగులు, తేనే మంచు పురుగు, గాలులను ఓ మాదిరిగా తట్టుకునేరకం.

 

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అనుకూలం.

 

ముఖ్యమైన వాణిజ్య రకం. ఎగుమతికి అనుకూలం.తెలంగాణలో కన్నా కోస్తా జిల్లాలలో 15 రోజుల ముందుగా కాయ పక్వానికి వస్తుంది. ఎక్కువ కాలం నిలవకు అనుకూలం.

 

తోతాపురి :
చెట్టు మద్యస్థం, నిటారుగా పైకి పెరుగుతుంది. ప్రక్కలకు కొమ్మలవ్యాప్తి తక్కువ. పండు మధ్యమం నుండి పెద్దది. తోలు మందం, బంగారు పసుపు రంగు, కండ గట్టిది. నారలేదు, నాణ్యత తక్కువ. బంగినపల్లి కన్నా ఆలస్యంగా కోతకు వస్తుంది. గాలి దుమారాలకు, పెనుగాలులకు తట్టుకోలేదు. నిలకడగా కాపు కాసేరకం.

 

బంగినపల్లి కన్నా ఎక్కువగా తేనే మంచుపురుగు ధాటికి గురవుతుంది. టెంక పురుగు, పండు ఈగ బెడద కూడా ఎక్కువ.

 

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అనుకూలం.

 

బాగా నిల్వ ఉండే రకం. పల్ప్ తయారికి అనుకూలం.

 

సువర్ణరేఖ :
చెట్టు మద్యస్థం,పండు మధ్యమం, తోలు మరీ మందంగా ఉండదు. ఎరుపురంగు. కంద మెత్తగా ఉండి, నార ఉండదు. నాణ్యత ఒక మాదిరి. నిలకడగా కాపు కాచే రకం.

 

తేనే మంచు పురుగును ఓ మాదిరిగా తట్టుకొంటుంది. బూడిద తెగులును కొంత వరకు గురవుతుంది.

 

శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం,  నెల్లూరు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో ఎక్కువుగా పెంచ బడుతుంది.                తెలంగాణ ప్రాంతానికి కూడ అనుకూలమైనది.

 

బాగా నిల్వ ఉంటుంది గనుక  ఎగుమతికి అనుకూలం.

కేసర్ :
చెట్టు పెద్దదిగా ఉంటుంది. కాయ బరువు 200 గ్రాములు.
పండు ఎరుపురంగుతో కండ బంగారు వర్ణంతో ఉండి, నార ఉండదు. అధిక నాణ్యత కల్గి ఉంటుంది. అత్యుత్తమం. త్వరగా కాపుకాస్తుంది.

      

 

         ---

 

కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు అనుకూలం.

 

ఎగుమతి చేయడానికి అనువైనది.

దశేరి :
చెట్టు మద్యస్థం. కాయ పరిమాణం స్వల్పం నుండి సాధారణం. తోలు మరీ మందంగా ఉండదు. పసుపు రంగు. కండగట్టిగా వుడి, నార తక్కువ. నాణ్యత కల్గి ఉంటుంది. త్వరగా కాపుకస్తుంది.

 

తేనె మంచు పురుగుకు, బూడిద తెగులకు గురవుతుంది.

 

ఉత్తర భారతదేశంలో ఉత్తమమైన రకం. తెలంగాణ జిల్లాలలో  పెంచి, ఉత్తరానికి ఎగుమతి చేయదగిన రకం. .

 

కాయబాగా నిల్వ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో కన్నా మన రాష్ట్రంలో 1 నుంచి 1 ½ నెలలు ముందుగా కోత కొస్తుంది.

హిమాయత్ :
కోత రకం. కాయ పెద్దది. నాణ్యత ఎక్కువ. శ్రేష్టమైన మామిడి రకాల్లో ఒకటి. నిలకడగా కాపుకాచే రకం.

 

తెగుల్లకు తట్టుకునే రకం.

 

కోస్తా,  తెలంగాణ ప్రాంతాలకు అనుకూలమైనది.

 

మే-జూన్ నెలల్లో కాయలు పక్వానికి వస్తాయి. కాపు కొంచెం తక్కువ.

బి. రసభరిత రకాలు

పెద్ద రసం :
పండు రసంతో ఉండి నార అధికంగా ఉంటుంది. పండు పరిమాణం పెద్దది. మధ్యకాలంలో కోత కొస్తుంది. నిలకడగా కాపు కొస్తుంది. ఏప్రిల్ 15 నుండి మే లోగా కోత కొస్తుంది.

         

 

            ----

 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలం.
కోస్తాలో ఎక్కువగా పెంచుతారు.

 

రవాణాకు పనికిరాదు.

చిన్నరసం: చెట్టు మద్యస్థం నుంచి  పెద్దద రకం. పండు మద్యమం, రస భరితం, రుచి, ఘాటు, నాణ్యత హెచ్చు. నార అధికం. ప్రతియేటా ఏప్రిల్ –మే నెలల మధ్యకాలంలో ఆలస్యంగా కాస్తుంది. 

        ------

రాష్టంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలం. కోస్తాలో ఎక్కువగా పెంచుతారు.

రవాణాకు పనికిరాదు. కాపు తక్కువగా ఉంటుంది.

చెరుకు రసం :
పండు దశేరిని పోలి, 250 - ౩౦౦ గ్రాములు బరువు కలిగి ఉంటుంది. నిలకడగా కాపు కాస్తుంది. మే నేల చివరిలో ఆలస్యంగా కోత కొస్తుంది.

       ---------

 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలం.

 

మిగిలిన రాకలతో పోలిస్తే పూత సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కాత నిస్తుంది. రవాణాకు అనుకూలం. 

సి. సంకర రకాలు

మంజీరా (రుమాని *నిలమ్) :
కోత రకం. బాగా పొట్టి రకం. తీపి ఎక్కువ. కాయ గుడుగా ఉంటుంది. నాణ్యత మద్యస్థంగా ఉంటుంది. బరువు సరాసరి 400 గ్రాములు. నిలకడగా కాపు కాని అధికోత్పత్తి నిచ్చేరకం.

 

బూడిద తెగులు, మంచు పురుగులను తట్టుకొంటుంది. కాని ఎండ దెబ్బకు ఎక్కువగా గురవుతుంది.

 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అనుకూలం.

 

అధిక సాంద్రతతో ఎకరాకు 200 చెట్లను నాటవచ్చు. 4.5*4.5 మీ. ఎడంతో పెరటి తోటల్లో పెంచడానికి అనుకూలం.

దాషేరి మహమూద్:
చెట్టు ఎత్తు మద్యస్థం. ఎకరాకు 100 చెట్లను నాటవచ్చు. నిలకడగా కాపుకొస్తుంది.

      
--------

          
 --------

కాపు పూర్తయినాక ఈ రకం పక్వానికి వస్తుంది. కాయ పరిమాణంలో తేడాలుంటాయి. అందువలన కాయలను దఫాలుగా కోయాలి. 

నీలం బేనిషాన్: కాయలు బెనిషాన్ వలె ఉంటాయి. మద్యస్తంగా ఉంటుంది. కండ గట్టిగా ఉండి నార ఉండదు. రసం నాణ్యత మద్యస్థంగా ఉండి బెనిషాన్ కన్నా ఆలస్యంగా కాపు కాస్తుంది. 

        -----

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలం.

కాయలు గుత్తుల్లో వస్తాయి. కాయల పరిమాణంలో తేడాలు ఉండటం వల్ల తయారైన కాయలను పలు దఫాలుగా కోయాలి.

అమ్రాపలి (దశేరి*నీలం) :
మద్యస్థ రకం. హెచ్చుగా కాస్తుంది. కాయలు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. కండ బంగారు రంగులో ఉటుంది.

          ------

తెలంగాణ ప్రాంతాలకు అనుకూలమైనది.

కాయలు గుత్తుల్లో వస్తాయి. ఆలస్యంగా, చాల బాగా కాపు నిస్తుంది.

మల్లిక (నీలం*దశేరి) :
చెట్టు మద్యస్థం. పండు పరిమాణం పెద్దది. నాణ్యత ఎక్కువ. కాయ పొడవుగా ఉంటుంది. సాధారణంగా కొమ్మకు 2 కాయలు చొప్పున కాస్తాయి. ప్రతి ఏట నిలకడగా కాపు కాస్తుంది.

        ------

రాష్ట్రమంతటా పెంచటానికి అనుకూలం.

       --------

రత్న :
కాయలు ఆల్ఫాన్సోలోని మంచి గుణాలు కలిగి ఉంటాయి. మద్యస్థంగా ఎదుగుతాయి. పండు కాండలో అల్ఫన్సోలో వలె స్పాంజి కణజాలం ఉంటుంది. కండ బంగారు వర్ణంలో ఉంటుంది.

         ------

రాష్ట్రమంతటా పెంచటానికి అనుకూలం.

అప్పుడప్పుడు పునాస కాపు నిస్తుంది.

అర్క పునిత్ :
పండు పరిమాణం మద్యస్థంగా ఉంటుంది. 180 – 220 గ్రాముల  సరాసరి బరువు ఉంటుంది.  కండలో పీచు ఉండదు. ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.

        -----

        -----

        -----

సింధూ :
టెంక చాల పలుచగా  ఉంటుంది. పండు మద్యస్థంగా ఉండి ఆకర్షినీయమైన ఎరుపు రంగుతో ఉంటుంది. 

        -----

        -----

        -----

కె.యం.యచ్.-1 (చెరకు రసం *ఖాండేస్) :
చెట్టు మద్యస్థం, నీటి ఎద్దడికి తట్టుకునే రకం. కాయలు గుండ్రంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం నిలకడగా కాపుకొస్తుంది.

        -----

        -----

మసి తెగులను తట్టుకునే రకం.

 

పునస రకాలు

 

 

 

రాయల్ స్పెసల్:
పండ్లు మద్యస్థంగా ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది. ఏట నిలకడగా పంట కాస్తుంది.

తేనె మంచు పురుగులను, గాలులను కొంత వరకు తట్టుకుంటుంది.

రాష్ట్రమంతట పెంచటానికి అనుకూలం.

ఇది ముఖ్య పునస రకం. దీనిని ‘చిరుతపుడి గోవా’ అని కూడ అంటారు. ఇది నీలం రకం.

 

 

 

అకాల కాపు నివ్వని ప్రాంతాల్లో కూడ సెప్టెంబర్, అక్టోబర్  మాసాల్లో కాయల నిస్తుంది.

బారమసి :
చెట్టు మద్యస్థం. కొంచెం పైకి పెరుగుతుంది. పండు మధ్యమం. తోలు మరీ మందంగా ఉండదు. పసుపురంగు కలిగిన కండ గట్టిగా ఉండి నార తక్కువ కలిగి నిలకడగా కాపు కాసే రకం.

బూడిద తెగులను, తేనె మంచు పురుగును గాలులను ఓ మాదిరిగా తట్టుకొంటుంది.

             -----

ఆకాలంలో కాపు నిచ్చే రకం.

బొబ్బిలి పునస: చెట్టు ఎత్తు మధ్యమం. పండు మధ్యమం. పసుపు రంగు కలిగిన కండ గట్టిగా ఉండి నార్ మద్యస్థంగా ఉంటుంది.

తేనె మంచు పురుగును,  గాలులను ఓ మాదిరిగా తట్టుకొంటుంది.

           -----

ఆకాలంలో కాపు నిచ్చే రకం.

 

నేల తయారీ:
వడగాల్పులు, పెనుగాలులు వీచే ప్రాంతాల్లో సరుగుడు, యూకలిప్టస్ మరియు ఎఱ్ఱ చందనం మొదలైనవి. గాలులు వీచే దిశలో రెండు వరుసల్లో 2 మీటర్ల ఎడంలో నాటాలి.  
నేలను 2 లేక ౩ సార్లు బాగా దున్ని, చదును చేసి 1*1*1 మీటర్ల గుంతలు తవ్వాలి. మొక్కల్ని గుంతల్లో నాటడానికి ముందు 50 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మరియు చెదలు రాకుండుటకుగాను 100 గ్రాముల ఫాలిడాల్ 2 శతం పొడిని త్రవ్విన మట్టిలో కలిపి గుంతలను నింపి, 7-10 మీటర్ల దురాన నాటాలి. బాగా సారవంతమైన నెలల్లో 12 మీటర్ల దూరంలో కూడ నాటుకోవచ్చు.
మొక్కలు నాటడం :

అనువైన కాలం :

మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబర్ వరకు నాటవచ్చు. మొక్కలు త్వరగా నాటుకొని అబివృద్ది చెందటానికి తక్కువ వర్సపాతం గల ప్రాంతాల్లో జూన్ – జూలై లోను, ఎక్కువ వర్సపాతం గల ప్రాంతాల్లో అక్టోబర్ – నవంబర్ మాసాల్లోను నాటుకొవాలి.

అంట్ల ఎంపిక :
చిడపిడలు ఆశించిన వేనిర్  గ్రాప్టింగ్ అంట్లను మత్రమే నాటుకోవాలి.వేరుములం మరియు సయాన్ బాగా అతికి ఉండాలి. అంట్లను నాటేటప్పుడు కొత్త చిగుళ్లు వేరుములంపై ఉండరాదు. అంటుకట్టిన బాగం భూమిపై నుంచి 20 సెం.మీ ఉండి అంటు పైబాగం పచ్చగా ఆరోగ్యంగా ఉండాలి. అంట్లు ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వయసు కలిగి  ఉండాలి.

అంటు మొక్కను మట్టి గడ్డతో సహా తీసి వేర్లు కదలకుండ గుంత
 

ఎరువుల యాజమాన్యం :
తక్కువ వర్షపాతం గల ప్రదేశాలలో ఎరువులను, పోషక పదార్దాలను వర్షాకాలం మొదట్లోను, రెండవసారి వర్షాకాలం చివరిలోనూ వెయ్యాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వర్షాకాలం చివర్లో వేసుకోవాలి.
తేలికపాటి భూముల్లో తగినంత చెరువు మట్టి గానీ, కంపోస్టూ గానీ వేయాలి. ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రాముల నత్రజని, 100 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పోటాస్ నిచ్చే ఎరువులును వేయాలి. తరువాత ప్రతి సంవత్సరం 100 గ్రాముల నత్రజని, భాస్వరం, పొటాస్ పెంచుతూ పోవాలి. పదవ సంవత్సరం, ఆ తరువాత ఒక్కో కిలో నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను (2175  గ్రాముల  యూరియా, 6250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 1670 గ్రాముల మ్యురేట్ అఫ్ పొటాస్ ) వేయాలి..  ఫిబ్రవరి చివరి వారంలో లేక మార్చి మొదటి వారంలో పిందె ఏర్పడిన తర్వాత సిఫార్సు చేసిన ఎరువుల్లో నాలుగవ భాగం మొక్కకు ఇవ్వడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. అది మరుసటి ఏడాది కాతకు కూడా దోహదపడుతుంది.  
నత్రజని 50 శాతం పశువుల ఎరువుల రూపంలో ఇవ్వాలి. మిగిలిన 50 శాతం రసాయన ఎరువుల రూపంలో అందించాలి. నాలుగు సంవత్సరాల లోపు వయస్సు చెట్లకు సిఫారసు చేసిన ఎరువులను 2 – ౩ నెలలకు ఒకసారి వేయాలి. మామిడి కోత అయిన వెంటనే సిఫారసు చేసిన 2/౩ వంతు ఎరువులను వేయాలి. మిగత 1/౩ భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో (ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో ) వేయాలి. కాయలు కోసిన వెంటనే జూన్ – జూలై మాసాల్లో 15 రోజుల వ్యధిలో రెండుసార్లు లీటరుకు నీటికి 5 గ్రాముల జింక్ సల్పేట్ తో పాటు 10 గ్రాముల యూరియాను ౦.1 మీ. లీ. స్టికర్/వెట్టార్  కలిపి పిచికారి చేయడం వలన జింక్ లోపాన్ని నివారించవచ్చు.
పోషక లోపాల యాజమాన్యం
జింక్ లోపం సాధారణంగా చౌడు నేలలో ఎక్కువగా వస్తుంది. జింక్ లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల నిలిచి క్రమేపి అవి పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింక్ లోపమున్న ఎడల ఆకులు చిన్నగా మారి సన్నబడి, పాకి లేదా క్రిందికి ముడుచుకొని పోతాయి. కణుపుల మద్యదూరం తగ్గిపోతుంది. కుల గులాబి రేకుల వలె గుబురుగా తయారవుతాయి.  మొక్కల పెరుగుదల క్షీణించి కాయల పెరుగుదల, నాణ్యత,  దిగుబడి తగ్గిపోతుంది.
బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకు కొనలు నొక్కుకు పోయినట్లు, పెళుసుబారుతాయి. కాయ దశలో కాయలు పగుళ్ళు చూపడం. సర్వసాదారణంగా కనపడే లక్షణం. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రాముల బోరాక్స్  లేదా బోరిక్ ఆమ్లం  భూమిలో వేయాలి.  లేదా కొత్త చిగురు వచ్చినప్పుడు ౦.1 నుండి ౦.2 శాతం బోరాక్స్ లేదా బోరిక్ ఆమ్లం  ఒకటి లేదా రెండుసార్లు పిచికారి చేయాలి.
ఇనుప ధాతులోపం గల చెట్లు ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోయి, తీవ్రమైన లోపం ఉన్న ఎడల మొక్కల ఆకులు పై నుండి క్రిందికి ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాదారణంగా కనపడుతుంది. దీని నివారణకు 2.5 గ్రాముల  అన్న బేది + 1  గ్రా. నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు కలిపి 15 రోజుల వ్యవదిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
సాదారణంగా మొక్కల ఎదుగుదల దశలో వివిధ సుక్ష్మపోషక పధార్ధాల లోప నివారణకు లీటరు నీటికి             5 గ్రాముల జింక్ సల్ఫేట్ + 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ +  2 గ్రాముల బోరాక్స్ + 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ + ౩  గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి సంవత్సరానికి 2 లేదా ౩ సార్లు జూన్ – జూలై సెప్టెంబర్ – అక్టోబర్,   డిసెంబర్ – జనవరి నెలల్లో లేదా మొక్కలు కొత్త చిగుర్లు తొడిగినప్పుడు రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయాలి. పాత్ర శ్లేషన ద్వార అక్టోబర్ మాసంలో పోషక విలువలను  బట్టి పొటాషియం  నైట్రేటను 10 గ్రా. చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారి చేయాలి.

 

మొక్కలు నాటడం :
అనువైన కాలం :
మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబర్ వరకు నాటవచ్చు. మొక్కలు త్వరగా నాటుకొని అబివృద్ది చెందటానికి తక్కువ వర్సపాతం గల ప్రాంతాల్లో జూన్ – జూలై లోను, ఎక్కువ వర్సపాతం గల ప్రాంతాల్లో అక్టోబర్ – నవంబర్ మాసాల్లోను నాటుకొవాలి.

అంట్ల ఎంపిక :
చిడపిడలు ఆశించిన వేనిర్  గ్రాప్టింగ్ అంట్లను మత్రమే నాటుకోవాలి.వేరుములం మరియు సయాన్ బాగా అతికి ఉండాలి. అంట్లను నాటేటప్పుడు కొత్త చిగుళ్లు వేరుములంపై ఉండరాదు. అంటుకట్టిన బాగం భూమిపై నుంచి 20 సెం.మీ ఉండి అంటు పైబాగం పచ్చగా ఆరోగ్యంగా ఉండాలి. అంట్లు ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వయసు కలిగి  ఉండాలి.
అంటు మొక్కను మట్టి గడ్డతో సహా తీసి వేర్లు కదలకుండ గుంత మద్యలో నాటి, మట్టితో గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా చిన్న కోయ్యపాతి కదలకుండ కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగుల వెడల్పు పాదాలు చేసి నీరు ఇవ్వాలి. తర్వాత 8-10 రోజుల కొకసారి వర్షాలు లేనప్పుడు నీరు కనీసం 2 సం// ల వరకు కాపాడాలి.

 

నీటి యాజమాన్యం :
చిన్న మొక్కలకు 6 నెలల వరకు ౩ రోజులకోసారి నీరు పెట్టాలి.  కాపు వచ్చిన చెట్లకు పూత, పిందె దశల్లో నీటి ఎద్దడి రాకుండా నీరు పెట్టాలి. మామిడి తోటలకు కాయ పెరిగే దశలో కనీసం రెండుసార్లు అంటే పిందె ఏర్పడిన తరువాత 25 – ౩0 రోజులకు ఒకసారి, నెలరోజుల తరువాత మరోసారి నీరు కట్టి కాయలు కోయటానికి 25 – ౩0 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. మామిడి కోత తరువాత వెంటనే ఒకసారి నీరుకట్టాలి. వేసవిలో నీటి ఎద్దటి ఏర్పడితే వేరుకుళ్ళు తెగులు ఉదృతి చెంది తోటంతా దెబ్బ తింటుంది.
డ్రిప్ నీటిపారుదల పద్ధతి కొత్తగా నాటిన తోటలకు, కాపు కాసే తోటలకు అనుకూలమైనది. ఈ పద్ధతిలో నారు వృధా కాదు కాబట్టి మామూలు నీటిపారుదల పద్ధతిలో పారించే విస్తీర్ణం కన్నా ౩ లేక 4 రెట్లు ఎక్కువ విస్తీర్ణాన్ని పారించవచ్చు. ఈ పద్ధతి వలన నీటి వాడకంలో పొదుపు జరిగి, చెట్లు బాగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి.  
చెట్లపాదుల్లో ఎండుగట్టి, ఎండిన ఆకులు, వరిపొట్టు, వేరు శనగ పొట్టు లాంటివి వేస్తె భూమిలోని తేమ ఆవిరైపోకుండా నిలుస్తుంది. భూమి వేడిని, కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తాయి. వేసిన కొద్ది కాలం తర్వాత కుళ్ళి ఎరువుగా మారుతాయి. ప్లాస్టికను కూడ మాల్స్ గా ఉపయోగించవచ్చు.

 
కలుపు యాజమాన్యం -  అంతరకృషి :
వర్షాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నడం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాననీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్రాటాఫ్ ఎకరకు 800 గ్రాములు  240 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. తరువాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గ్లైసేల్ లేదా రౌండప్ కలుపు మందును కలిపి దానితోపాటు 20 గ్రాముల . అమ్మోనియం సల్ఫేట్ గాని, 10 గ్రాముల యూరియా కలిపి 20 – 25 రోజుల కలుపుపై పిచికారి చేయాలి. ఈ మందు వాడేటప్పుడు చిన్న వయసు పండ్ల మొక్కల మిధ పడకుండ జాగ్రత్త వహించాలి. (చీని, నిమ్మ, ద్రాక్ష, జామ, సపోట, దానిమ్మ, రేగు, సీతాఫలం, పండ్లతోటల్లో కూడ ఇదే విధంగా కలుపు నివారించవచ్చు)
అంతర పంటలు :
లేత తోటల్లో కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు, ఫాల్సా, బొప్పాయి లాంటి పండ్ల తోటలను మిశ్రమ పంటలుగా వేసుకోవచ్చు. అంటు మొక్కలు ఎదిగే వరకు కాయగూరలు, పెసలు, అలసందలు వంటి అంతర పంటలు వేసుకోవాలి. పెద్ద తోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు వంటి పైర్లను వేసుకోవచ్చు. నేలను త్వరగా నిస్సారం చేసే మొక్కజొన్న,  పిండిపురుగు ఎక్కువుగా ఆశించే కందిని, జింక్ మరియు పోటాష్ లోపాలను పెంచే నేపియర్ గడ్డిని అంతర పంటలుగా పెంచరాదు.
 

ప్రూనింగ్ మరియు ట్రైనింగ్ (కత్తిరింపులు)
మొక్క క్రింది నుంచి 50 సెంటి మీటర్ల వరకు ఎటువంటి కొమ్మలను రానీయకుడదు. ప్రధాన కాండంపై 2 లేదా ౩ బలమైన కొమ్మలను ఎన్నుకొని పెరగనివ్వాలి. మిగతావి తీసివేయాలి. పక్క కొమ్మల పొడవు 60 – 80 సెంటి మీటర్లు ఉండేలా కత్తిరించుకోవాలి. ఈ విధంగా నిర్ధారించిన ఆకారం వచ్చే వరకు చేయాలి. పెద్ద చెట్లలో ప్రతి సంవత్సరం కాయకోత తర్వాత జూన్ – జూలై మాసాల్లో అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను, రెమ్మలను తీసివేయుట వలన సూర్యరశ్మి చెట్టంతా బాగా సోకి మంచి కాపునిస్తుంది. కాయ వదిలేసినా తొడిమలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసిన తర్వాత ప్రతి ఒక రెమ్మ చివరి నుండి ౩-5 చిగిర్లు వస్తే రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి.
పిందె రాలడం తగ్గించడానికి ఒక గ్రాము నాఫ్తలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని 10 మిల్లి లీటర్ల మిధనాల్ లో  కరిగించి తర్వాత  50 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. లేదా 2, 4-డి-10 పి.పి.యం. (1 గ్రా. 2, 4-డి పొడిని 100 లీటర్ల నీటిలో కలిపి ) ద్రావణాన్ని పిచికారి చేయాలి.

 

పంట కోత   :  
మామిడి కాయల్ని అనువైన పరికరాల(హర్వేస్టర్ల)ను ఉపయోగించి కోస్తే కాయలకు ఏ విధమైన హాని కలుగకుండా తొడిమలతో సహా కోయవచ్చు. జీడి లేక సొన కారకుండా వుండి కాయలు ఎక్కువ రోజులు నిల్వ  ఉంటాయి. మార్కెట్లో ధర కూడ అధికంగా ఉంటుంది.  పాటుకాయ రాలితే తెంపడానికి సిద్ధంగా ఉన్నదని అనుకోవాలి. కాయ తొడిమకు ఇరువైపులా పాలిపోయిన/లేత పసుపుపచ్చ రంగురావడం, కాయ ఉపరిభాగాన నూనె  గ్రంధులు ఏర్పడటం అనేది కోతకు  సరైన దశ.
బంగినపల్లిలో టి.యస్.యస్. 9.౦ దశేరిలో 8.5 వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు. సంచులు తగిలించిన గడలతో కాయల్ని తెంపి, కిందికి చేరవేయాలి. జీడి సోన అంటినప్పుడు పండు పైన చార ఏర్పడుతుంది. జీడి వీలైనంతవరకు అంటకుండా కాయను కొంతసేపటి వరకు బోర్లించి కారనియ్యాలి. కాయలను వరుసలుగా గడ్డిలో పేర్చి మండివేస్తారు. పూర్తిగా పండే వరకు ఈ మండేలను కదల్చకూడదు.  కాయలు కోసేటప్పుడు కాయకు ఒక అంగుళం తొడిమ ఉండేటట్లు డాపోలి హర్వేస్టారు ఉపయోగించి కోసుకోవాలి.  కాయలను 6 శాతం మైనపు ద్రావణంలో ముంచి తీయడం వలన 2 – 4 రోజులు ఆలస్యంగా పండుతాయి. పండుతునప్పుడు బరువును ఎక్కువగా నష్టపోవు.  ఇలా చేయడం వల్ల రోగాలు కూడా రాకుండా ఉంటాయి.  
కాయలు కోసేటప్పుడు తొడిమెలతో సహా కోయాలి. కోత పూర్తయిన తరువాత ఎండుకొమ్మలను, అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను తీసివేయాలి.  చెట్టు చుట్టూ లోతుగా దున్ని, ఎరువులను వేసి వెంటనే నీరు కట్టాలి. జూలై – ఆగష్టు మాసాల్లోనూ,  తిరిగి అక్టోబర్ మాసంలోనూ లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్, 10 గ్రాముల  యూరియా కలిపి చెట్టంతా పిచికారి చేయాలి.
మామిడి కాయలని కోసే కొన్ని పరికరాలు:   
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, బెంగుళురు వారు రూపొందించిన ఐ.ఐ.హెచ్.ఆర్. పరికరం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూడిల్లి వారు రూపొందించిన ఐ.ఎ.ఆర్.ఐ. పరికరం, సెంట్రల్  ఇన్సిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఫర్ నార్ర్తన్ ప్లెయిన్స్,లక్నో, (యూ.పి.) వారు రూపొందించిన సి.ఐ.హెచ్.ఎన్.పి. పరికరం, కొంకణ్ కృషి విద్యపిఠ్ వాళ్ళ డపోలి పరికరం.  కాయల తొడిమను డపోలి పరికరం కత్తెరల మద్య వుంచి లాగినప్పుడు స్ప్రింగు వల్ల కత్తెరల దగ్గరగా వచ్చి తొడిమను కత్తిరిస్తాయి. కాయలు చట్రానిక (ఫ్రేమ్) అమర్చిన వలలో పడతాయి.